మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు

Maharashtra political updates

మహారాష్ట్రలో రాజకీయం రసవతారంగా సాగుతుంది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. నిన్న జరిగిన అనేక మలుపులు మహారాష్ట్రను రాష్ట్రపతి పాలన దిశగా నడిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ చేతులెత్తేసిన తర్వాత గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి నిన్న సాయంత్రం ఏడున్నర గంటల వరకు గడువిచ్చారు. అయితే, కాంగ్రెస్, ఎన్‌సీపీ నుంచి మద్దతు కూడగట్టడంలో శివసేన విఫలమైంది. దీంతో తమకు మరో 48 గంటల సమయం కావాలని గవర్నర్‌ను అభ్యర్థించింది. అందుకు నిరాకరించిన గవర్నర్.. మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి 24 గంటల సమయం ఇచ్చారు.అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎన్సీపీకి కూడా కష్టసాధ్యమే. ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేన, కాంగ్రెస్ సహకరించాలి. అది దాదాపు అసాధ్యం కావడంతో ఈ ప్రయత్నం కూడా విఫలం కావడం తథ్యంగా కనిపిస్తోంది. అతిపెద్ద పార్టీలుగా అవతరించిన మూడు పార్టీలకు అవకాశం ఇచ్చిన గవర్నర్.. చివరగా రాష్ట్రపతి పాలనకు కేంద్రాన్ని సిఫారసు చేయనున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

tags : maharashtra, president rule, governor, bhaghsingh koshyari, bjp, ncp, shiv sena, congress

maharashtra politics

అయోధ్యలో కార్తిక పౌర్ణమి వేడుక

నేడు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై తీర్పు ?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article