‘మ‌హ‌ర్షి` డ‌బ్బింగ్ మొద‌లు…

MAHARSHI MOVIE DUBBING STARTED
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`. మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న 25వ చిత్ర‌మిది. పూజా హెగ్డే ఇందులో నాయిక‌. అల్ల‌రి న‌రేష్ మ‌హేష్ ఫ్రెండ్‌గా క‌నిపించ‌నున్నారు. అశ్వ‌నీద‌త్‌, పీవీపీ, దిల్‌రాజు క‌లిసి పీవీపీ సంస్థ‌, వైజ‌యంతీ మూవీస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తోంది. ఇందులో మ‌హేష్ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. తాజాగా ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. పూజతో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ వ‌ర్గాలు. సినిమాను ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌బోతున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article