పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకున్న `మ‌హ‌ర్షి`

“Maharshi” Movie team Polachi Sceduled was completed
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`. మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న 25వ చిత్ర‌మిది. పూజా హెగ్డే ఇందులో నాయిక‌. అల్ల‌రి న‌రేష్ మ‌హేష్ ఫ్రెండ్‌గా క‌నిపించ‌నున్నారు.  అశ్వ‌నీద‌త్‌, పీవీపీ, దిల్‌రాజు క‌లిసి పీవీపీ సంస్థ‌, వైజ‌యంతీ మూవీస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తోంది. ఇందులో మ‌హేష్ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నారు. షూటింగ్ ద‌శ‌లోని ఈ సినిమా రీసెంట్‌గా పొల్లాచ్చి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం అవుతుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను  ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. 
More Video SUBSCRIBE YT/tsnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *