Sequel for Maharshi movie
సూపర్‌స్టార్ మహేష్ 25వ సినిమా `మహర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్‌రాజు, పివిపి నిర్మిస్తోన్న చిత్రమిది. ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 5న సినిమా విడుదల అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ తేదీన సినిమాను విడుదల చేయలేకపోవచ్చుననే వార్తలు వినపడుతున్నాయి. అయితే సినిమా విడుదల మాత్రం ఏప్రిల్‌లోనే ఉంటుందట. ఈ సినిమాలో మహేష్ ఓ పెద్ద కంపెనీకి సి.వి.ఒ పాత్రలో కనపడతాడు. తన స్నేహితుడు అల్లరి నరేష్ గ్రామాన్ని బాగు చేయడానికి వస్తాడట. మహేష్ చేసే మంచి పనులు చూసి నచ్చని అక్కడి పెద్దలు అతనిపై కక్ష కడతారు. వారిని ఎదుర్కొనడానికి ఏం చేశాడనేదే కథ అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇది మహేష్, కొరటాల కలయికలో వచ్చిన `శ్రీమంతుడు` సినిమాకు సీక్వెల్‌లా అనిపిస్తుంది కదూ..