Maharshi will postpone
మహేష్ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రం `మహర్షి` చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 9 న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 25న విడుదల చేస్తామని రీసెంట్‌గా దిల్‌రాజు ప్రకటించాడు. అయితే ఏప్రిల్‌లో ఎన్నికలు చివరి వారంలో రానుండటం.. సినిమా షూటింగ్ కాస్త పెండింగ్ ఉండటం.,. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉండటం వంటి కారణాలతో `మహర్షి`ని సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినపడుతున్నాయి. ఈ తరుణంలో యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.