చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ భవిష్యత్తు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టును నడిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఐపీఎల్ 2022 సీజనే ధోనీ కెరీర్‌లో చివరి ఐపీఎల్ లీగ్ కానుంది. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌లోనే ధోనీ.. ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగింది. అయితే సొంత అభిమానుల మధ్య సొంత మైదానంలో వీడ్కోలు తీసుకోవాలని భావించిన ధోనీ.. ఆ నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసాడు.