`ఎఫ్ 2`కు మ‌హేష్ ప్ర‌శంస‌లు

Mahesh Babu Appreciates F2 Fun and Frustration
వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ న‌టించిన `ఎఫ్ 2` సినిమా సంక్రాంతికి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైంది. సినిమా చాలా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సినిమాను చూసిన మ‌హేష్ .. ట్విట్ట‌ర్ వేదిక‌గా సినిమాను ఆసాంతం ఎంజాయ్  చేశాన‌ని చెబుతూ చిత్ర‌యూనిట్‌ను అభినందించారు. “ఎఫ్ 2 సినిమా చూశా.. వినోద్మాత‌క చిత్రం. చాలా ఎంజాయ్ చేశా.. వెంకీ స‌ర్ త‌న పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయారు. వ‌రుణ్ తేజ్ పాత్ర కూడా స‌ర‌దాగా ఉంది. వెంకీ స‌ర్ టైమింగ్‌కు వ‌రుణ్ స‌రిగ్గా స‌రిపోయారు“  అన్నారు మ‌హేష్‌. అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌లు నిర్మించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article