Mahesh Babu acting with 2 actress
మహేష్ 25వ సినిమా `మహర్షి` పూర్తి కానుంది. మరో పక్క 26వ సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. `పటాస్` నుండి రీసెంట్గా విడుదలైన `ఎఫ్ 2` వరకు వరుస విజయాలను సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నాడు. అనీల్ సుంకరతో పాటు మహేష్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా రూపొందనుంది. మహేష్ చేసిన దూకుడు సినిమాకు ఇది సీక్వెల్ అని వార్తలతో పాటు ఈ సినిమాకు అనిల్ రావిపూడి `వాట్సాప్` అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. నిజానికి మహేష్, సుకుమార్ సినిమా రూపొందాల్సి ఉంది. కానీ సుకుమార్ కథ మహేష్‌కు నచ్చకపోవడంతో .. కథ ప్రిపరేషన్‌కు సమయం పట్టేలా ఉండటంతో అనిల్ రావిపూడి సినిమాకు మహేష్ కమిట్ అయ్యాడట. క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో సుక్కు సినిమా చేయడం లేదంటూ మహేష్ అధికారికంగా ట్విట్టర్లో ప్రకటన కూడా కూడా చేశాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒకరు సాయిపల్లవి, మరొకరి పేరు రష్మిక మందన్నా అని వినపడుతుంది. జూలైలో సినిమా స్టార్ట్ అవుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయాలనేదే నిర్మాతల ఆలోచనగా కనపడుతుంది.
Latest Interesting Telugu News Tsnews
For More New