మ‌హేష్ ఇల్లు… బ్రౌన్ రైసూ!

Mahesh Babu Home and Brown Rise

తెలుగు సినిమా అని ఎవ‌రైనా అన‌గానే న‌టి అమృతారావుకు మ‌హేష్ ఇల్లు, వాళ్లింటి నుంచి వ‌చ్చిన బ్రౌన్ రైసూ గుర్తుకొస్తాయ‌ట‌. తెలుగులో మ‌హేష్ ప‌క్క‌న `అతిథి`లో న‌టించిన ఢిల్లీ అమ్మాయి అమృతారావు. ఆ త‌ర్వాత తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు. క‌థానాయిక పాత్ర‌కు తెలుగు సినిమాల్లో స‌రైన న్యాయం చేయ‌డం లేద‌నే ఉద్దేశంతోనే ఆమె ఆ త‌ర్వాత తెలుగు సినిమాలు చేయ‌లేద‌ట‌. ప్ర‌తి నెలా రెండు, మూడు అవ‌కాశాలు ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లాయ‌ట‌. అయినా వాటిలో త‌న పాత్ర న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆమె అంగీక‌రించ‌లేద‌ని తెలిపారు. అయితే మ‌హేష్ తో చేసిన `అతిథి`లో త‌న కేర‌క్ట‌ర్ చాలా బాగా న‌చ్చిందంట‌. పైగా న‌మ్ర‌త‌, మ‌హేష్ త‌న‌ను రిజీవ్ చేసుకున్న విధానం న‌చ్చ‌డంతో ఆ సినిమా ఎప్పుడు షూటింగ్ జ‌రిగిందో , ఎప్పుడు పూర్త‌యిందో అర్థం కానంత త్వ‌ర‌గా పూర్త‌యింద‌నీ చెప్పుకొచ్చింద అమృత‌.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article