రాజకీయాల్లో మహేష్ బాబు

Mahesh Babu in Politics ..నమ్రత ఏమన్నారంటే

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సినీహేరోల రాజకీయ ఆరంగేట్రం పై పెద్ద చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తారని, ఎమ్మెల్యే గా పోటీ చేస్తారని చర్చ జరిగితే ఇక తాజాగా మహేష్ బాబు పై పెద్ద చర్చ జరుగుతుంది. ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయాల్లోకి రాబోతున్నారా ? ఒకపక్క బావ గల్లా జయదేవ్, మరోపక్క బాబాయి ఆదిశేషగిరిరావు టిడిపిలో చేరిన నేపథ్యంలో బాబు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా వీరిద్దరి కోసం టిడిపికి బాసటగా ప్రచారం చేయబోతున్నారా? రానున్న ఎన్నికల నేపథ్యంలో మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు రాజకీయ ప్రవేశం వార్తలపై ఆయన సతీమణి నమ్రత స్పందించారు. పెదనాన్న ఆదిశేషగిరి రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో మహేష్ బాబు రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నమ్రత ఆ విషయంపై స్పందించారు. మహేశ్‌బాబుతో పద్నాలుగు వసంతాల వైవాహిక జీవితాన్ని పంచుకున్న నమ్రతకు ఓ ప్రశ్న ఎదురైంది. రీల్‌ లైఫ్‌లో మహేశ్‌ని ముఖ్యమంత్రిగా చూశాం, రియల్‌ లైఫ్‌లో చూసే అవకాశం ఉందా అనేది ఆ ప్రశ్న.
ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టారు. మహేష్ బాబును తెరపై చూస్తే చాలునని, బాబుకి కూడా రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదని సమ్రత సమాధానం చెప్పారు. మహేష్ బాబు ఫోకస్‌ అంతా నటన మీదేనని, ఆయన ప్రేమించేది సినిమాలనే అని నమ్రత అన్నారు. సినిమాలు తప్ప మరో విషయం మహేష్ బాబుకు అర్థం కాదని,మహేష్ బాబు రాజకీయాల్లోకి రాబోరని క్లారిటీ ఇచ్చారు నమ్రత.

 

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article