ఇందిరాదేవి కన్నుమూత.. బాలకృష్ణ సంతాపం

Mahesh Babu Mother Expired on Wednesday

‘‘ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”- నందమూరి బాలకృష్ణ సంతాపం

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. సినీనటుడు కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య అనే విషయం తెలిసిందే. వీరికి కొడుకులు రమేష్ బాబు, మహేశ్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రముఖ సినీ నటి విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. కృష్ణ రెండో భార్య విజయనిర్మల 2019లో చనిపోయారు. కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు 2022 జనవరి 8 న మృతి చెందారు. ఇందిరా దేవి మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం 9 గం.లకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచుతారని తెలిసింది. ఆ తరవాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతారని సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article