సోషల్ మీడియా పుణ్యమాని ఏ విషయమైనా క్షణాల్లో బయటికొచ్చేస్తుంది.మంచైనా చెడైనా దాని గురించి పెద్ద యెత్తున చర్చ మొదలవుతుంది. అది రూమర్ అయినా సరే, వెంటనే స్ప్రెడ్ అయిపోయి జనాల్ని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది.మహేష్‌బాబు సినిమా విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారికి అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది.ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా పేరుని ఉగాదికి ప్రకటించేద్దామనే ఆలోచననలో ఉంది చిత్రబృందం.కుదరకపోతే ఏప్రిల్ అనుకొంటోంది. ఇంతలోనే ఆ టైటిల్ ఏమిటనే విషయంపై ఓ గాసిప్ బయటికొచ్చింది. నిజంగా అది గాసిప్పా లేక అందులో కొంత నిజం ఉండొచ్చా అనేది మాత్రం తెలీదు.కానీ సినిమాకి `అమ్మ కథ` అనే పేరుని పరిశీలిస్తున్నారనేది ఆ రూమర్.
త్రివిక్రమ్ సినిమా పేరు అ అక్షరంతో మొదలవుతుందనే ఓ సెంటిమెంట్ ఈ రూమర్‌కి మరికొంత బలం చేకూరుస్తోంది.అయితే ఈ టైటిల్ ఒక పక్క విస్తృతంగా వైరల్ అవుతుండా, దీని గురించి అదే స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది. ఈ టైటిల్ ఏంటి? అంటూ నిలదీస్తున్నవాళ్లు కొందరు, బాగుందని కొందరూ తమ అభిప్రాయాల్నివ్యక్తం చేస్తున్నారు. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్…సర్కారు వారి పాట తర్వాత మహేష్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి.అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇన్ని అంచనాలుంటే… అమ్మ కథ అంటూ సాఫ్ట్ టైటిల్ పెడతారా? అసలు ఇది మాస్‌కి ఎక్కుతుందా అంటూ నిర్మాతల్ని నిలదీస్తున్నారు నెటిజన్లు.మరి యూనిట్ మనసులో ఏ టైటిల్ ఉందో, ఏది ఖరారవుతుందో అనేది మాత్రం తెలియడం లేదు.