Mahesh Babu teams up with KGF director
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెట్టించిన ఉత్సాహంతో రాబోతున్నాడు. తర్వాత మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇందులో మహేష్ బాబు కొత్త పాత్రలో కనిపించబోతున్నాడనే వినిపిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఏప్రిల్ లో ప్రారంభం అవుతుంది అంటున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తారట. అయితే ఈ లోగా మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమా పై ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
కొన్నాళ్ల క్రితం కన్నడ దర్శకుడు కెజిఎఫ్ వంటి బిగ్గెస్ట్ మూవీ తీసిన ప్రశాంత్ నీల్ మహేష్ బాబును కలిసి వెళ్లాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనుకుంటున్నారు. అదే టైమ్ లో ప్రశాంత్ ఎన్టీఆర్ కోసం సినిమా చేయాల్సి ఉందని కూడా వార్తలు రావడంతో ముందు ఎన్టీఆర్ తర్వాతే మహేష్ అనుకున్నారు. బట్ లేటెస్ట్ గా జరిగిన పరిణామాలు చూస్తే మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి తర్వాత ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.
రీసెంట్ గా ప్రశాంత్ నీల్ మహేష్ బాబు తన స్టోరీ లైన్ నెరేట్ చేశాడట. అది వినగానే ఇంప్రెస్ అయిన మహేష్ వెంటనే అతన్ని నిర్మాత అల్లు అరవింద్ వద్దకు పంపించాడు. అక్కడ కూడా కథ చెప్పి ఒప్పించమనే అర్థంతో. ప్రశాంత్ ‘ఆ క్యాంప్’ను కూడా ఇంప్రెస్ చేసినట్టు సమాచారం. దీంతో వంశీ పైడిపల్లి తర్వాత ప్రశాంత్ నీల్ తోనే మహేష్ సినిమా అనేది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు. మొత్తంగా అల్లు అరవింద్, మహేష్ బాబు సంయుక్తింగా నిర్మించే ఈ సినిమాతో ప్రశాంత్ నీల్.. మన సూపర్ స్టార్ కు కూడా ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెస్తాడేమో చూడాలి.