మ‌హేష్ అభిమానుల‌కు తెలియ‌జేయున‌ది ఏమ‌నగా

Mahesh babu to his fans

ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు శుభ‌వార్త‌. మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని ఒక రోజు హైద‌రాబాద్‌లో ఉంచ‌నున్నారు. ఇంత‌కు ముందు ఎప్పుడూ ఎవ‌రి మైన‌పు విగ్ర‌హాన్నీ హైద‌రాబాద్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌లేదు. మ‌హేష్ విగ్ర‌హ‌మే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఫిబ్ర‌వ‌రి ఆఖ‌రి వారంలో మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ ఆవ‌ర‌ణ‌లో ఈ మైన‌పు విగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు. మేడ‌మ్ టుస్సాడ్స్ ఈ విగ్ర‌హాన్ని రూపొందించింది. హైద‌రాబాద్‌కు వ‌చ్చి మ‌హేష్ కొల‌త‌లు తీసుకెళ్లి ఈ విగ్ర‌హాన్ని త‌యారు చ‌రేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సింగ‌పూర్‌లో ఉన్న ఈ విగ్ర‌హాన్ని ఒక రోజు సంద‌ర్శ‌న నిమిత్తం హైద‌రాబాద్‌కు తీసుకురానున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article