రెండు ట్రైలర్ల పరిస్థితేంటి?

Mahesh Fans Happy On Ala Vaikuntapuramlo Trailer

ఈ సారి సంక్రాంతి పండుగకు సినిమా జోరు కాస్త నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పూజా హగ్దే హీరోహీరోన్లుగా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మహేష్ బాబు రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న రిలీజ్ కానుంది.. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. కాగా ఏ రెండు సినిమాలకు అసెట్ ఏంటంటే విజాశాంతి మరియు టబు. వీరిద్దరూ గత కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఈ రెండు చిత్రాలతో రీ ఎంట్రీ ఇవ్వడం రెండు సినిమాలకు పెద్ద ప్లస్.

అయితే విషయం ఏంటంటే తాజాగా త్రివిక్రమ్ బన్నీ సినిమా అల వైకుంఠపురంలో ట్రైలర్ రిలీజ్ అయింది. ఆద్యంతం కామెడీ మరియు ఎంటర్టైనర్ గా సాగిన ఈ చిత్ర ట్రైలర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల వైకుంఠపురంలో ట్రైలర్ సో..సో..అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇక బన్నీ ఫాన్స్ సైతం నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ట్రైలర్ చూశాక ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. అల వైకుంఠపురంలో సినిమాని కేవలం త్రివిక్రమ్ మాటలతో నడిపించాడు. పెద్దగా కథ లేదనే తెలుస్తుంది. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీగా మారతాడు. తన బాస్ తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె ఫ్యామిలీలోని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి నడుం కడతాడు. ఆ క్రమంలో విలన్ ఎంట్రీ.. తర్వాత కుటుంబం, ఆడవాళ్ల గురించి నాలుగైదు ఉపన్యాసాత్మక డైలాగులు.. కట్ చేస్తే క్లైమాక్స్. ఇది అల వైకుంఠపురంలో ట్రైలర్ పరిస్థితి.

* ఇక సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ చూస్తే సినిమాలో ఎక్కువ భాగం కామెడీ మధ్య మధ్యలో విలన్ ఎంట్రీ, ముఖ్యంగా విజయశాంతి డైలాగ్స్ అద్భుతంగ ఉన్నాయ్. ఇక హీరోయిన్ పాత్ర చూస్తుంటే అనిల్ రావిపూడి మార్క్ కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ రెండు ట్రైలర్లు చూస్తే సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ముందు.. అలవైకుంఠపురములో ట్రైలర్ కాస్త చిన్నబుచ్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. బొమ్మ హిట్టు ఖాయం అని ఫిక్స్ అయిపోయారు.

Mahesh Fans Happy On Ala Vaikuntapuramlo Trailer,Sarileru Neekevvaru VS Ala VaikuntaPuramlo

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article