మహేష్ ఫ్యాన్స్ సందడేదీ

26
mahesh fans
mahesh fans

mahesh fans

స్టార్ హీరోల ఫ్యాన్స్ అంటే వారు కూడా స్టార్స్ లానే ఫీలవుతుంటారు. తమ హీరోల మీద ఈగ వాలనీయరు. ఎవరైనా చిన్న కమెంట్ చేస్తే వారిని వెంటాడి వెంటాడి మరీ ఓ ఆట ఆడుకుంటారు. ఆ క్రమంలో వారు  చాలాసార్లు అతి చేస్తున్న భావనా కలుగుతుంది. అలాగే వీరి ఓవరాక్షన్ ను, ఇతరులపై ఫ్యాన్స్ చేసే జుగుప్సాకరమైన కమెంట్స్ ను హీరోలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు అనేలా వాళ్లు కూడా అభిమానులను కంట్రోల్ చేయరు. కనీసం ఓ మాట కూడా చెప్పరు. ఇక నెగెటివ్ అంశాల్లోనే కాదు.. పాజిటివ్ అంశాల్లోనూ అభిమానులు అందరికంటే మా హీరోనే తోపు అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల బర్త్ డేస్ అంటే ఇంక చెప్పలేం. దానికి నెలల ముందుగానే(ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. ఆ మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ ఆరు నెలల ముందే మొదలుపెడితే.. తమిళ్ హీరో సిద్ధార్థ్ ఓ రేంజ్ లో కౌంటర్స్ వేశాడు గుర్తుందా..?) బర్త్ డే సందడి మొదలుపెడతారు. మూడు నెలల నుంచి మొదలై.. త్రీ డేస్ టు గో, టూ డేస్ టు గో, ఒన్ డే టు గో.. అంటూ ఓ రేంజ్ లో హంగామా చేస్తుంటారు.

కానీ ఈ సారి మహేష్ బాబు బర్త్ డేకు ఫ్యాన్స్ నుంచి ఆ స్థాయిలో అస్సలు సందడే కనిపించడం లేదు. ఈ నెల 9ప సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. అంటే ఇంకా వారం కూడా లేదు. అయినా సోషల్ మీడియాలో ఊహించిన రేంజ్ లో అభిమానుల హల్చల్ కనిపించడం లేదు. ఈ విషయంలో ఇతర హీరోల అభిమానులు కూడా కొందరు ఆశ్చర్యపోతోంటే.. మరికొందరు మీ హీరోకు అంత లేదా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పాండమిక్ టైమ్ లోఉన్నాం. అందుకే ఫ్యాన్స్ అంతా ఆ ఇబ్బందిలో ఉన్నారు. అందుకే ఈ బర్త్ డే కు అంత జోష్ లేదనుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో కూడా ఏమంత సందడి లేదు కదా.. అంటే ఇప్పుడు మహేష్ బాబు నటించిన కొత్త సినిమాలేం లేవు కదా. అందుకే కామ్ గా ఉన్నారు అంటున్నారు. అంటే బర్త్ డే స్పెషల్ గా ఓ కొత్త పోస్టరో లేక, టీజరో వచ్చే ఛాన్స్ లేదు కదా. అందుకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదా అనే డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా చిరంజీవి ఫ్యాన్స్ ఆల్రెడీ ఫస్ట్ తారీఖునే ‘20డేస్ టు గో’అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ ఎందుకంత కామ్ గా ఉన్నారో..?

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here