Mahesh rejecting Vamsi Paidipally
వంశీ పైడిపల్లి.. మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత అసలేం జరిగిందా అని ఆరాలు తీశారు. చాలా వరకూ ఇది మహేష్ బాబు మిస్టేక్ అనుకున్నారు. కానీ వాస్తవాలు తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేలు వంశీ వైపే చూపిస్తుందట. సరిలేరు నీకెవ్వరు సినిమా అయ్యాక మహేష్, వంశీ కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయింది. అయితే గతంలోవంశీ చెప్పిన మెయిన్ థీమ్ మహేష్ కు బాగా నచ్చింది. దాన్నే మంచి కథగా డెవలప్ చేయాలనుకున్నారు. చేయమని చెప్పాడు. ఈ లోగా తను అనిల్ రావిపూడితో సినిమా ఫినిష్ చేశాడు. ఇటు నిర్మాత దిల్ రాజు ఈ కథ విషయంలో కొంత కేర్ తీసుకుంటున్నాడు అని మహేష్ భావించాడట. కానీ దిల్ రాజు మహేష్ కే అంతా తెలుసు అనుకున్నాడు. దీంతో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వంశీ ఇద్దరికీ చెప్పకుండా వేరే కథ రాసుకున్నాడట. దీంతో ఫుల్ స్క్రిప్ట్ విన్న తర్వాత మహేష్ షాక్ అయ్యాడని సమాచారం. పోనీ ఆ కథ చేయాలన్నా అస్సలే మాత్రం బాలేదట. అందుకే ఓ రకంగా ఇది మోసం అని గ్రహించిన మహేష్ బాబు వంశీ పైడిపల్లిని సైడ్ చేశాడు అనేది ప్రస్తుతం వినిపిస్తోన్న మహేష్ బాబు వైపు కథ.
మరి ఇది నిజమే అయితే వంశీకి మరో స్టార్ హీరో చాన్స్ ఇస్తాడా.. అనేది డౌటే. అసలే మనోడికి ప్రతి సినిమాకూ ఓ రేంజ్ లో గ్యాప్ వస్తుంది. కానీ ఈ సారి తనే తెచ్చుకునేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ ఈ వ్యవహారంలో వంశీ పైడిపల్లి ఓపెన్ అయి తనేదైనా నమ్మదగిన విషయం చెబితే కొంత తేడా వస్తుందేమో.