మహేష్ బాబుతో మరోసారి త్రివిక్రమ్ ..?

22
mahesh with prince
mahesh with prince

mahesh with prince

కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయంటే ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. అందుకు కారణం ఆ కాంబోలో అంతకు ముందు వచ్చిన సినిమాలు. అంత ఖుష్ చేసే కాంబినేషన్స్ గురించి తెలుగులో చెప్పాలంటే చాలా తక్కువగానే ఉన్నాయి. అలాంటిదే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలూ నేటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను నవ్విస్తూనే ఉన్నాయి. అందుకే హ్యాట్రిక్ మూవీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరి వీరి వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పడబోతోందా..? మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచే సినిమా అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ నటించిన సినిమా ఇది. ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు అదరగొడితే.. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసిన కామెడీతో పాటు సెంటిమెంట్, లవ్, యాక్షన్ ఇలా అన్నీ మిక్స్ అయిన అతడు థియేటర్స్ కంటే బుల్లితెరపైనే బిగ్గెస్ట్ హిట్. అతడు ఎన్నిసార్లు టివిల్లో వచ్చిన చాలామంది రిమోట్స్ కు పనిచెప్పరు అనేది నిజం. అంతలా ఆడియన్స్ ను ఆకట్టుకుందా సినిమా. అతడు తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఖలేజా మాత్రం వెండితెరపై ఆ రేంజ్ లో సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి. అంతకు ముందే పోకిరి వంటి మాసివ్ మూవీ చేసిన మహేష్ సడెన్ గా కామెడీ చేసేసరికి.. ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు.

బట్.. ఆ తర్వాత రియలైజ్ అయ్యారు. మహేష్ బ్రిలియంట్ టైమింగ్ ను మిస్ అయ్యామనుకున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖలేజా మళ్లీ టివిల్లో సూపర్ హిట్ గానే నిలిచింది. ఈ రెండు సినిమాలూ మహేష్ లోని కొత్త కోణాలతో పాటు త్రివిక్రమ్ పంచ్ లకు పరాకాష్టగానే నిలిచాయి. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కు బ్రేక్ పడి దశాబ్ధం దాటింది. ఇన్నేళ్లలో ఎవరికి వారుగా రికార్డులు బ్రేక్ చేస్తూ వెళుతున్నారు. కానీ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేయడం లేదు. అయితే త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు. ఇటు మహేష్  కూడా సర్కార్ వారి పాట తర్వాత రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత వచ్చే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కు కథ కూడా రెడీ అయిందంటున్నారు. అయితే ఈ సారి అతడు, ఖలేజాల్లో కేవలం ఎంటర్టైనర్ కాకుండా కాస్త సెంటిమెంట్ ను కూడా దట్టించబోతున్నారట. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి 2022లో ఈ సినిమా వచ్చే ఛాన్సులున్నాయంటున్నారు. చూద్దాం.. మరి ఈ సారైనా థియేటర్స్ లో సత్తాచాటతారేమో..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here