డిష్యూం డిష్యూం : మహేష్ కు విలన్ గా అనిల్ కపూర్?

39
Mahesh babu and Anil kapoor

# Maheshbabu varses Anilkapoor

‘సర్కార్ వారి పాట’ రోజురోజుకు అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీలో మహేశ్ డ్యూయల్ రోల్ పోశించనున్నట్లు తెలుస్తోంది. మరో ట్విస్ట్ ఎంటంటే బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ మహేశ్ తో తలపడనున్నారట. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ను సంప్రదించిందట చిత్రబృందం. అనిల్‌ కపూర్‌కు కథను వినిపించారట కూడా. ఒకరి మీద ఒకరు ఎలాంటి ఎత్తులు వేసుకుంటారో చూడాలి.  ఎవరిదో పైచేయి అవుతుందో మరి.

మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. బ్యాంక్‌లో తీసుకున్న సొమ్మును తిరిగి కట్టకుండా పారిపోయే విలన్ల ఆట హీరో ఎలా కట్టించాడన్నది చిత్రకథ అని సమాచారం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, కెమెరామేన్‌: మది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here