మహేష్ కసరత్తులు రాజమౌళి సినిమా కోసమేనా?

Mahesh's exercises are for Rajamouli's film

జిమ్ములో మహేష్ చెమటోడిస్తున్నాడు. కండలు పెంచే పనిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. సహజంగా సినీ తారలకు ఫిట్నెస్ పై మక్కువ ఎక్కువ. వాళ్లు జిమ్ములో సందడి చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని సినిమాల కోసం,  పాత్రల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతుంటారు. స్పెషల్ ట్రైనర్స్ ని అపాయింట్ చేసుకుని వాళ్ల సమక్షంలో పాత్రలకు తగ్గట్టుగా కండలు పెంచడంపై దృష్టి సారిస్తుంటారు. విదేశాల నుంచి కూడా ట్రైనర్లని పిలిపిస్తుంటారు. రాజమౌళిలాంటి దర్శకుడు అయితే తన హీరోల ఫిజిక్ విషయంలో ఏమాత్రం రాజీపడరు. తన పాత్రలకి తగ్గట్టుగా  పక్కగా తయారయ్యాకే సెట్ లోకి తీసుకెళ్తుంటారు. త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా కండలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ కి కూడా రాజమౌళి అలాంటి టాస్క్ అప్పగించినట్టు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే మహేష్  జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది.
రాజమౌళి తదుపరిచిత్రం మహేష్ కథానాయకుడుగానే రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నప్పటికీ అదొక ఎంటర్టైనర్ మాత్రమే. ఇందులో మహేష్ కండలు  ప్రదర్శించాల్సినంత అవసరమేమీ ఉండదు. సో…. మహేష్ దృష్టి అంతా కూడా రాజమౌళి సినిమా పైనే అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గ్లోబ్  ట్రాట్టింగ్ థీమ్ తో రూపొందుతోంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందించనున్నారు. సో మహేష్ కూడా హాలీవుడ్ హీరోలకి దీటుగా కనిపించేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. అన్నట్టు మహేష్ – త్రివిక్రమ్ సినిమా సోమవారం నుంచి రీస్టార్ట్ అయింది. రాజమౌళి ఆస్కార్ సందడి నుంచి ఫ్రీ అవ్వగానే మహేష్ సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article