Tuesday, May 13, 2025

పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న యువతి

  • పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న యువతి
  • బలూచిస్తాన్ ప్రావీన్స్ లో ప్రజల అంతర్యుధ్దం

తీవ్రవాదాన్నిఅడ్డుపెట్టుకుని ప్రపంచానికి కొరకరాని కొయ్యగా తయారైన దాయాది దేశం పాకిస్తాన్‌ కు ఎదురవుతున్నకొత్త సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకు కారణం కేవలం ఒక యువతి. అవును పాకిస్తాన్ ప్రభుత్వం ఓ యువతి వల్ల నిద్ర లేని రాత్రలు గడుపుతోంది. పాకిస్తాన్‌ లో స్వాతంత్య్రం కోసం పలు రాష్ట్రాల్లో చాలా రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చడంతో, పాక్ ప్రభుత్వానికి, నిరసనకారులకు మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది.

ప్రధానంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌ల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ వైద్యురాలు పాకిస్తాన్ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ యువతి పేరు మహరంగ్ బలోచ్. స్వాతంత్ర్య పోరాటంలో తండ్రి చనిపోవడంతో ఇప్పుడు తానే రంగంలోకి దిగింది మహారంగ్ బలోచ్. ఈ పోరాటంలో తనకు తోడుగా ఉన్న సోదరుడిని సైతం కోల్పోయిందా యువతి.

ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహరంగ్ బలోచ్ ఒక సామాజిక కార్యకర్త. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ.. బలూచిస్తాన్ ప్రావీన్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. పాకిస్తాన్‌లో ఖనిజ వనరులకు కేంద్రంగా ఉన్న బలూచిస్తాన్‌ ప్రావీన్స్ పై పొరుగున ఉన్న డ్రాగన్ దేశం చైనా కన్నేయడం, అందుకు పాకిస్థాన్ ప్రభుత్వం పరోక్షంగా సహకరించడంతో తిరుగుబాటు మొదలైంది. తమ భూమిపై చైనా పెత్తనం ఏంటని  ప్రశ్నిస్తున్న బలూచిస్తాన్ జనం పోరాటాన్నిమొదలుపెట్టారు. మహరంగ్ బలోచ్ నేతృత్వంలో పాక్ సర్కార్ కు వ్యతిరేకంగా అంతర్యుధ్దం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com