`మ‌హర్షి` వాయిదా ప‌డిందా

Mahesh babu Maharshi Movie Postponed
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`. మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న 25వ చిత్ర‌మిది. పూజా హెగ్డే ఇందులో నాయిక‌. అల్ల‌రి న‌రేష్ మ‌హేష్ ఫ్రెండ్‌గా క‌నిపించ‌నున్నారు.  అశ్వ‌నీద‌త్‌, పీవీపీ, దిల్‌రాజు క‌లిసి పీవీపీ సంస్థ‌, వైజ‌యంతీ మూవీస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తోంది. ఇందులో మ‌హేష్ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5న విడుద‌ల చేస్తార‌ని అన్నారు. అయితే తాజాగా క‌నిపిస్తున్న ప‌రిణామాల దృష్ట్యా ఈ సినిమా ఏప్రిల్ 5న విడుద‌ల కావ‌డం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ 5న నాగ‌చైత‌న్య `మ‌జిలీ` విడుద‌ల‌వుతుంది. ఏప్రిల్ 12న సాయిధ‌ర‌మ్ తేజ్ `చిత్ర‌ల‌హ‌రి` విడుద‌ల‌వుతుంది. అంటే మ‌హేష్‌కు పోటీగా వీళ్లు సినిమాను విడుద‌ల చేసుకోరు. అంటే వీళ్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారంటే మ‌హేష్ సినిమా వెన‌క్కు వెళ్లిన‌ట్లేనని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఏప్రిల్ చివ‌రి వారం లేదా.. మే మొద‌టి వారంలో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article