మాళవిక నాయర్ ఇప్పటిదాకా క్లీన్ సినిమాల్లోనే నటించింది. ఆమె చేసిన పాత్రలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. కానీ తొలిసారి `పలానా అబ్బాయి పలానా అబ్బాయి`లో కొంచెం భిన్నంగా కనిపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆమె ముద్దు సన్నివేశాలతో మురిపించేశారు. మరి ట్రైలర్‌లోనే అలా ఉంటే… సినిమాలో ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు
అందరిలోనూ. ఇదే విషయాన్ని మాళవికని అడిగితే… ఆమె గడుసుగా సమాధానం ఇచ్చింది. “అందరూ ఇంటిమేట్ సీన్స్ అని తెగ అడుగుతున్నారు. కానీ అందరూ అనుకున్నంత సన్నివేశాలేమీ కావవి.
ముద్దు సీన్లు కూడా టేస్ట్‌ఫుల్‌గా ఏమాత్రం అభ్యంతరకరం కాని రీతిలో ఉంటాయి. వాటిని చేసేటప్పుడు ఓ మహిళగా నేనెలాంటి అసౌకర్యానికి గానీ, ఒత్తిడికిగానీ గురికాలేదు. అంత సహజంగా ఉంటాయి ఆ సన్నివేశాలు. పాత్రకి సన్నివేశానికి అవసరమైన ముద్దులు అవి. తెరపై చూస్తే మీరే ఆ విషయాన్ని ఒప్పుకుంటార“ని సెలవిచ్చింది మాళవిక. ఈ ముద్దుగుమ్మలో ప్రతిభ బోలెడంత, అవకాశాలు మాత్రం అప్పుడప్పుడూ తలుపు తడుతుంటాయి. కానీ వాటితోనే మెప్పిస్తూ రాణిస్తోంది. ఈమె, నాగశౌర్య కలిసి నటించిన `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.