మళయాల స్టార్లూ.. మీరు మెగాస్టార్లు..

27

malayala stars cuts remunaration

పేరుకే ఆ స్టారూ ఈ స్టారూ అని పెట్టుకుంటారు కొందరు. కానీ నిజమైన సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆస్టార్ కు తగ్గ ప్రవర్తన కనిపించదు. ఇలాంటి వాళ్లు దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటారు. కానీ అన్ని ఇండస్ట్రీలూ ఒకలా ఉండవు అని నిరూపిస్తోంది మాలీవుడ్. యస్.. కరోనా కారణంగా అన్ని పరిశ్రమలూ కుదేలైపోయిన నేపథ్యంలో సినిమా పరిశ్రమ మరీ దారుణంగా దెబ్బతిన్నది అనేది నిజం. ప్రతి రోజూ షూటింగ్ ల ద్వారా వేలాదిమందికి పని కల్పిస్తూ కోట్లలో ప్రభుత్వాలకు టాక్స్ లు కడుతూ.. అటు థియేటర్స్ ద్వారానూ టాక్స్ లు కడుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తోన్న సినిమా పరిశ్రమకు ఇది నిజంగా చాలా గడ్డు కాలం. ఈ గడ్డు పరిస్థితి నుంచి పరిశ్రమ బయట పడాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకుని ముందుకు రావాల్సిన తరుణం ఇది. ఇప్పటికే మూడు నెలలకు పైగా షూటింగ్ లు లేవు. ఒకవేళ మొదలైనా ఎన్ని సినిమాలు ఇంతకుముందులా సజావుగా షూటింగ్ కు వెళతాయనే గ్యారెంటీ లేదు. అంటే చాలామంది నిర్మాతల ఆర్థిక పరిస్థితి ఈ మూడు నెలల్లో తలకిందులై పోయింది. మరి నిర్మాత లేకుండా ఏసినిమా పరిశ్రమ కూడా లేదు కదా. అందుకే వారిని ఆదుకునేందుకు మళయాల స్టార్లంతా కలిసి ఓ కీలకమైన, అబ్బుర పరిచే నిర్ణయం తీసుకున్నారు.

గత ఆదివారం మాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ఓ హోటెల్ లో సమావేశం అయ్యారు. రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో దాని గురించి చర్చించాలనుకున్నారు. అన్నట్టుగానే ‘అమ్మ’(అసోసియేషన్ ఆఫ్ మళయాల మూవీ ఆర్టిస్ట్స్) లోని కీలక సభ్యులంతా సమావేశమై.. ఇకపై తమ రెమ్యూనరేషన్స్ లో ‘50శాతం’ తగ్గించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రకటించక ముందే వారికి పోలీస్ ల నుంచి షాకింగ్ న్యూస్ తెలిసింది. అమ్మా సభ్యులు సమావేశమైన హోటెల్ కంటైన్మెంట్ జోన్ లో ఉందట. అందుకే ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయాలని పోలీస్ లు చెప్పారు. అయితే వీరు హోటెల్ ను బుక్ చేసినప్పుడు అది కంటైన్మెంట్ జోన్ లో లేదు. అందుకే పొరబాటు జరిగిందని.. వెంటనే మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అందువల్ల తాము తీసుకున్న యాభైశాతం రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా అనే నిర్ణయం అఫీషియల్ గా ప్రకటించకుండానే హెటెల్ ఖాళీ చేశారు. అయితే మరోసారి సమావేశమై తమ నిర్ణయానికి కట్టుబడే ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఏదేమైనా మళయాల స్టార్లు నిజంగానే మెగాస్టార్లు అనిపంచుకుంటున్నారులే..

mallywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here