మ‌ల్లారెడ్డి భూభాగోతం ఇదే

150
Revanth Reddy Exposed Malla Reddy Land Scams
Revanth Reddy Exposed Malla Reddy Land Scams

అసెంబ్లీ సాక్షిగా అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసారు.. దేవాదాయ భూములు కబ్జా చేసారని ఈటెల రాజేందర్ పై విచారణ కు ఆదేశించారు. ఈటెలపై ఫిర్యాదులు వచ్చాయని మంత్రి వర్గం నుంచి తొలగించారు…
మంత్రుల పై చర్యలు తీసుకోవడం ద్వారా అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించననే సందేశం ప్రజలకు కేసీఆర్ పంపారు. మ‌రి, గత కొన్ని రోజులుగా మంత్రి మల్లారెడ్డి పై నిర్దిష్ట ఆరోపణలు చేస్తున్నా.. గతంలో మల్లారెడ్డి 50 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో వైరల్ అయినా సీఎం విచారణ కు ఆదేశించడం లేద‌ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ లు అమ్ముకున్న ఆరోపణలు వ‌చ్చినా చర్యలు తీసుకోలేదని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నిల‌దీశారు.

  • మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి కి ఇచ్చిన భూములలో గుండ్ల పోచం పల్లి మున్సిపాలిటీ లో 650 సర్వే నెంబర్ 22 ఎకరాల భూమి ఉంటే.. ఇప్పుడు ఇదే సర్వే నెంబర్ లో 33 ఎకరాల భూమి ఉంది.. ఓకే సర్వే నెంబర్ భూమి ఇప్పుడు ఎలా పెరిగిందని ప్ర‌శ్నించారు. శ్రీనివాస్ రెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కి భూమి బదిలీ అయిందని.. అయితే శ్రీనివాస్ రెడ్డి భూమి యజమాని ఎలా అయ్యాడో వివరాలు లేవన్నారు. 650 సర్వే నెంబర్ లో ఉన్న భూమి ని కొందరు రియలెస్టేట్ వ్యాపారులు ఎప్పుడో అమ్మారని.. మల్లారెడ్డి యూనివర్సిటీ కి సంబంధించిన భూముల పూర్తి వివరాలు తాను బయట పెడుతున్నాన‌ని వెల్ల‌డించారు.

న్యాక్ నిషేధిస్తే.. యూనివ‌ర్శిటీ ఇస్తారా?
జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో 488 సర్వే నెంబర్ లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వే నెంబర్ భూమి లో సీఎంఆర్ హాస్పిటల్ వచ్చింది. రిజిస్ట్రేషన్ లు నిషేదించిన భూమిలో మల్లారెడ్డి ఆసుపత్రి నిర్మించారు. గ్రేడింగ్ కోసం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి తప్పుడు పత్రాలు ఇచ్చారని న్యాక్ గుర్తించి…5 సంవత్సరాల క్రిత‌మే న్యాక్ నిషేధించింది. న్యాక్ నిషేదించిన కాలేజీకి కేసీఆర్ యూనివర్సిటీకి ఎలా అనుమతులిచ్చార‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ,కేటీఆర్ చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మరోటి అని చెప్పారు. ఈడీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలన్నారు. తప్పుడు ధృవ పత్రాలతో కాలేజీలు, సూళ్ళ అనుమతులు పొందారని.. అవినీతి విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలిపారు.
ఇంత అవినీతి చేసిన మల్లారెడ్డి పై కేసీఆర్ ఎందుకు విచారణ కు ఆదేశించడం లేదని ప్ర‌శ్నించారు. మూడు చింతలపల్లిలో మల్లారెడ్డి అనుచరులు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా తాము సంమయనం పాటించామ‌న్నారు. ఈ త‌తంగాన్ని డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నేతలు దూషిస్తున్నారని తెలిపారు. రాజయ్య, ఈటెల కు ఓక నీతి.. మల్లారెడ్డి కి ఓక నీతా అని నిల‌దీశారు. మల్లారెడ్డిలో కట్టిన బిల్డింగ్ లు అన్ని అక్రమ నిర్మాణాలేన‌ని తేల్చి చెప్పారు. మల్లారెడ్డి అక్రమాల పై పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాన‌ని.. విచారణకు ఆదేశించడానికి సీఎం సిద్ధంగా ఉన్నారా అని స‌వాల్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here