రేవంత్ రెడ్డి తుస్సుమన్నడా?

124
Malla Reddy Sensational Comments On Revanth Reddy
Malla Reddy Sensational Comments On Revanth Reddy Malla Reddy Sensational Comments On Revanth Reddy

అసెంబ్లీలో మంత్రి మ‌ల్లారెడ్డి మాట్లాడుతుంటే సాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలే న‌వ్వుతుంటారు. జోకులేస్తుంటారు. నిజానికి, యువ ఎమ్మెల్యేలంతా అత‌న్ని కామెడిగా చూస్తుంటారు. తాజాగా, రేవంత్ రెడ్డిపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే న‌మ్మ‌శ‌క్మంగా అనిపించ‌డం లేదు. గ‌త‌కొంత‌కాలం నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్న విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్ట‌లేక మంత్రి మ‌ల్లారెడ్డి మ‌తిలేకుండా మాట్లాడుతున్నార‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. ఇంత‌కీ, మ‌ల్లారెడ్డి ఏమ‌న్నాడో తెలుసా? ఆయ‌న మాటల్లోనే..

‘‘ కొండను తొవ్వు ఎలకను పట్టినట్లు..జిరాక్స్ పేపర్లు తెచ్చు ,భూకబ్జా ఆరోపణలు చేసాడు. ఏదైనా చెప్తే నమ్మెటట్లు ఉండాలి..ఊరికే బుదర జల్లితే సరిపోద్దా? జవహర్ నగర్ లో మొత్తం ప్రభుత్వ భూమే ఉంది. దేశంలో ని చాలా ప్రాంత ప్రజలు సొంత ఇళ్ళు కట్టుకున్నారు. కనీస మౌలిక వసతులు లేని జవహర్ నగర్లో టిఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించింది. జవహర్ నగర్ లో 330 ఎకరాల లో ఉన్న పేద ప్రజల ఇళ్ళకు పట్టాలిచ్చాం. జవహర్ నగర్ లో నా కోడలు పేరుమీద 448 సర్వే నెంబర్ లో 350 గజాల భూమి ఉంది. జవహర్ నగర్ లో పేద ప్రజలకు హాస్పిటల్ లేదు.. అందుకే హాస్పిటల్ నిర్మించాం. మెడికల్ కాలేజీ కోసం రోగులు అవసరం.. స్థానికంగా ఉండే ప్రజలకు వైద్యం మా మెడికల్ కాలేజీ ద్వారా అందిస్తున్నాం. నన్ను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. టీడీపీలో ఎంపీ అయిన దగ్గర నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. 2014లో మల్కాజిగిరి ఎంపీ సీటు నేను తీసుకున్నాననే కోపంతో రేవంత్ రెడ్డి నా కాలేజీలు మూయిస్తా అని బెదిరించాడు. నేను అప్పుడు చంద్రబాబు కు కూడా ఫిర్యాదు చేసా. ఈ దేశంలో మొదటి గర్ల్స్ కాలేజీ పెట్టింది నేనే. దొంగ కాగితాలు చూపెట్టి నాపై ఆరోపణలు చేస్తున్నాడు. మల్లారెడ్డి కాలేజీలలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అని రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే..హెచ్ ఆర్డీ మినిస్టర్ ఏంప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఢిఫెన్స్ కమిటీ లో ఉండాలని ఎంపీ రేవంత్ రెడ్డి కి నేనే సూచించా. కంటోన్మెంట్ లో ఢిఫెన్స్ కమిటీ పర్యటించినప్పుడు..ఇక్కడ నివాస స్థలాలు, ఫంక్షన్ హాల్ లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసాడు. రేవంత్ రెడ్డి ఇంద్ర‌వెల్లికి ప్రేమ్ సాగర్ ను, ర్యావిరాల సభకు మల్రెడ్డి బ్రదర్స్ ను బలి చేసిండు. మూడు చింతలపల్లి లో వజ్రేష్ యాదవ్, హరివర్దన్ ను బలి చేసాడు. ఓక్కో మీటింగ్ కు రేవంత్ రెడ్డి రావాలంటే 50 లక్షలు డిపాజిట్ చేయాలి. మరో సభకు బకరా కోసం నేతను వెతుకుతున్నాడు. చెట్టు ను, చెరువును చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తాడు. దివాళా తీసిన పార్టీ కి రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ ను తిడితే ప్రజలే బుద్ధి చెపుతారు.

గుండ్ల పొచంపల్లి లో 21 ఎకరాల లో నా యూనివర్సిటీ ఉంది. రేవంత్ రెడ్డి 650 సర్వే నెంబర్ లో నా యూనివర్సిటీ ఉందని ఆరోపించారు. అసలు 650 సర్వే నెంబర్ లో నాకు భూమే లేదు. నాకు 600 ఎకరాల కు రైతు బందు వస్తుందని సీతక్క ఆరోపిస్తున్నారు. కాలేజీలు ఉన్న భూమికి రైతు బంధు ఎలా వస్తుంది? మీకు తెలియదా. సీతక్క మంచిదే..రేవంత్ రెడ్డి మాయ మాటలు చెబుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి సొంత బామ్మర్ది కాదు..చాలా దూరపు చుట్టం. శ్రీనివాస్ రెడ్డి కి 16 ఎకరాల భూమి ఉంది. దానికి పట్టా కూడా ఉంది. నా యూనివర్సిటీ భూమిలో శ్రీనివాస్ రెడ్డి భూమి లేదు. నేను పాలు, పూలు అమ్మి అభివృద్ధి చెందిన. మరి రేవంత్ రెడ్డి ఏం చేసి సంపాదించిండు? రేవంత్ రెడ్డి మర్యాద తెలుసుకోవాలి. నేను తలుచుకుంటే రేవంత్ మైండ్ బ్లాక్ అయితది. రేవంత్ పై నా కామెంట్స్ చూసి కాంగ్రెస్ వాళ్ళే నాకు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. రేవంత్ కు ఇజ్జత్ ఉంటె హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలి. నేను సంవంత్సరానికి 2కోట్ల 30 లక్షలు ట్యాక్స్ కడుతున్నా. రైతు బంధు వస్తుందా రాదా అనేది నేను చూసుకోలేదు. నా జీతం, నా పీఎ ల జీతం సామాజిక కార్యక్రమాలకు వాడుతున్నా. నా పీఏలకు నేనే సొంతంగా జీతం ఇస్తున్నా..’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here