మ‌ల్లికా రీ ఎంట్రీ

Mallika Re-entry
కొన్నేళ్ల క్రితం మ‌హేష్ భ‌ట్ `మ‌ర్డ‌ర్` చిత్రంలో త‌న అందాల‌తో కుర్ర కారును ఆక‌ట్టుకున్న మ‌ల్లికా షెరావ‌త్ త‌దుప‌రి ప‌లు హిందీలో చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. ద‌క్షిణాదిన త‌మిళంలో శింబు సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. క‌మ‌ల్ హాస‌న్ `ద‌శావ‌తారం` సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. జాకీచాన్ `మిత్‌`లో న‌టించి అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకుంది. నాలుగేళ్ల క్రితం `డ‌ర్టీ పాలిటిక్స్‌`లో న‌టించిన మ‌ల్లికా మ‌రో సినిమాలో క‌న‌ప‌డ‌లేదు.  ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో నటించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా స‌మాచారం. ఏక్తాక‌పూర్ సోద‌రుడు తుషార్ క‌పూర్ హీరోగా ప‌ర్హాద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే `బూ స‌బ్‌కీ ఫ‌తేగీ` అనే వెబ్ సిరీస్‌లో మ‌ల్లికా న‌టించ‌నున్నారు. హార‌ర్ కామెడీగా ఈ వెబ్ సిరీస్ రూపొంద‌నుంది
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article