సుప్రీం కోర్టులో మమతకు ఎదురుదెబ్బ

Mamatha problems form supreme court … సీపీ హాజరు కావాలి

సీబీఐ వర్సెస్ మమత వివాదంలో సుప్రీం కోర్టు సీపీ కి షాక్ ఇచ్చింది. మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.పశ్చిమబెంగాల్‌ శారదా చిట్స్ కుంభకోణం కేసులో మంగళవారం నాడు సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు విషయమై కోల్‌కత్తా సీపీని సీబీఐ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే వచ్చిన ఇబ్బందులేమిటని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.శారదా కుంభకోణం కేసులో విచారణకు వచ్చిన సీబీఐ అధికారులకు బెంగాల్ ప్రభుత్వం నుండి ఆదివారం నాడు సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ విషయమై బెంగాల్ సీపీని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని మమత బెనర్జీ ఆరోపణలు చేశారు.
సీబీఐ తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి నుండి ఆమె కోల్‌కత్తాలో దీక్ష చేపట్టారు. ఇదిలా ఉంటే శారదా స్కామ్‌లో సీపీ ఆధారాలను మార్చారని సీబీఐ కోల్‌కత్తా సీపీపై ఆరోపణలు చేసింది.ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడ అఫిడవిట్ దాఖలు చేసింది.సీబీఐ విచారణకు కోల్‌కత్తా సీపీ రాజీవ్ కుమార్ హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సీపీ రాజీవ్ కుమార్ హాజరైతే తప్పేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కేసు విచారణ ప్రారంభమైన వెంటనే రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ తమ వాదనలను విన్పించారు.కోల్‌కత్తా సీపీని అరెస్ట్ చేయకూడదని కూడ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ఘటనపై సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదికను అందించింది.మమత బెనర్జీ కూడ విచారణకు రావాలని సుప్రీంలో ఏజీ వాదించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article