mamidipalem farmers fires on revenue officers
విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కార్ ఆదిషంగా పనులు మొదలు పెట్టింది. మండలిలో బిల్లు ఆమోదం పొందకున్నా సరే మూడు రాజ్దానులపై వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్తుంది. ఇక ఈ నేపధ్యంలో విశాఖ పరిసర ప్రాంతాల్లో అధికారులు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా, అనకాపల్లి మండలం, మామిడిపాలెంలో ల్యాండ్ పూలింగ్ చేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులకుఈ క్రమంలో చుక్కెదురైంది. జీవీఎంసీ పరిధిలో ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా తమ భూములను ఇచ్చేది లేదంటూ మామిడిపాలెం గ్రామస్తులు తేల్చి చెప్పారు. తాహసీల్దార్ కారుకు అడ్డు పడ్డారు. తమ నిరసన తెలిపారు. దీంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగి వెళ్ళిపోయారు.