టాయిలెట్ కు వెళితే అనుమానంతో చంపేశారు

92
Man Killed On The Way To Toilet
Man Killed On The Way To Toilet

Man Killed On The Way To Toilet

మేడ్చల్ జిల్లా ఆద్రాస్ పల్లి గ్రామంలో లక్ష్మి అనే మహిళ గత 6 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. షుగర్ తో కాలు కూడా తీసివేశారు. బిపి వుంది. డయాలసిస్ చేయిస్తున్నారు. అనారోగ్యంతో ఈనెల 18వ తేదీ బుధవారం నాడు ఆమె చనిపోయింది. అదే రోజు సాయంత్రం ఆమె దహన కార్యక్రమాలు నిర్వహించారు. అదే రాత్రి 8.30 గంటలకు బోయిన ఆంజనేయులు, ఆటో డ్రైవర్, 24 సంవత్సరాల యువకుడు అటువైపు వెళ్ళారు. అది చూసి, చేతబడి చేసింది ఇతనేనని, అందువలననే ఇటువైపు వచ్చాడని ఆమె బందువులు భావించి, అతన్ని అదే చితిమంటలలో వేసి, అతి దారుణంగా చంపారు. ఆ సమయంలో అతను ప్రతిఘటించడంతో సదరు మహిళా బందువులకు కూడా చేతులు కాలాయి. మృతి చెందిన ఆంజనేయులుకు పైల్స్ వుండడంతో తినగానే టాయిలెట్ కు చెరువు దగ్గరకు వెళ్ళే అలవాటు వుంది. అదే అలవాటుతో అటు వైపు వెళ్ళడంతో ఇతనే చేతబడి చేశాడనే అనుమానంతో, ఆ మ‌హిళ బ‌ం‌‌ధువులు ఈ ఘోర దుర్ఘటనకు తెగించారు. అంతేగాని, ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు లేవు. కేవలం చేతబడిలాంటి మూఢనమ్మకాల పభావంతోనే వారు ఈ దారుణానికి పాల్పడినట్లు  పరిశీలనలో తేలింది. కె. శంకర్, సి. ఐ., బి. లలిత నర్సింహ్మ, సర్పంచ్
పోలీస్ డిపార్ట్ మెంట్లతో కలసి అందె సత్యం, రావుల వరప్రసాద్,రాజా, మేడ్చల్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి,రామ్ మోహన్ రావు, విజయ్ తదితరులు ఆ గ్రామంలో పర్యటించారు. ఈ వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.

Telangana Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here