ఖర్చు అవుతుందని బిడ్డనే హతమార్చిన తండ్రి

Man Kills Daughter For Money Expenses

కన్న తండ్రే ఆ బిడ్డ పాలిట కాలయముడయ్యాడు . అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారికి వైద్యం చేయించలేక ఉసురు తీశాడు . వికారాబాద్ జిల్లాలోని జామాపూర్ తండాకు చెందిన రవినాయక్.బ్రతుకుతెరువు కోసం సంగారెడ్డి జిల్లా  సదాశివ మండలంలోని ఆత్మకూరుకు వలస వెళ్లాడు. అక్కడే తాపీపని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో రవినాయక్ మొదటిభార్య కుమార్తె రేణుక అనారోగ్యంతో బాధపడుతుంటే ఆస్పత్రులకు ఖర్చు పెట్టలేక బిడ్డ ప్రాణాలు తీశాడు . గొంతు నులిమి చంపేశాడు .

రేణుక నవాబు పేటలోని కస్తూరిబా గాంధీ బాలికల స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రేణుకకు జ్వరం వచ్చింది. దీంతో రవినాయక్ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. జ్వరం ఎక్కువైంది. దాదాపు 20 వేలు ఖర్చు చేసినా రేణుకకు జ్వరం తగ్గలేదు . తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న రేణుకను  ఆస్పత్రికి అని తీసుకువెళ్ళి హతమార్చాడు .దారి మధ్యలో రేణుక నాన్నా..దాహం వేస్తోంది మంచినీళ్లు కావాలని అడిగిన రేణుకకు  నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన రవినాయక్ జ్వరం తగ్గటానికి మందు రాస్తానని చెప్పి రేణుక గొంతు నులిమి చంపేశాడు.

తరువాత కూతురుకి ఎక్కిళ్లు వచ్చి ఊపిరి ఆడక చచ్చిపోయిందని భార్య బుజ్జిని నమ్మించాడు. తరువాత కూతురి అంత్యక్రియలకు తమ స్వగ్రామం అయిన వికారాబాద్ జిల్లాలోని తమ తండాకు తీసుకెళ్లాడు.  ఈ క్రమంలో అత్యక్రియల కార్యక్రమంలో రేణుక గొంతుపై కమిలిన గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు..బంధువులు అనుమానాలు వ్యక్తంచేశారు. వెంటనే వీఆర్వోకు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణుకను పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రేణుక హత్యకు గురైందని పోస్ట్ మార్టం నివేదికలో తెలియటంతో పోలీసులు రవినాయక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Man Kills Daughter For Money Expenses,#sangareddy,#vikarabad,#renuka , ravi nayak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *