సుంకొల్లులో దారుణ హత్య

ఏలూరు:కుటుంబ కలహాల నేపథ్యంలో నూజివీడు మండలం సుంకొల్లులో ఒక వ్యక్తి దారుణ హత్య జరిగింది. సుంకొల్లు గ్రామానికి చెందిన సింహాద్రి రవి కుమార్ ను, అతని సభ్యులు సింహాద్రి వంశీ సింహాద్రి చందు సింహాద్రి కృపారావు సింహాద్రి మంగమ్మలు నాయకులు ఆరేపల్లి రాంబాబు, కొండలరావుల ప్రోద్భలంతో హత్య చేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం సాయంత్రం భూమి వివాదంలో ఘర్షణ చెలరేగడంతో మృతుడు సింహాద్రి కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పాత కక్షలు నేపథ్యంలో టిడిపి కార్యకర్త అయిన సింహాద్రి కుమార్ ను వైసిపి నాయకులు హత్య చేయించినట్లు మృతుడి భార్య కృష్ణవేణి కుమారుడు కార్తీక్ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నూజివీడు టిడిపి ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, నూజివీడు మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు ముసునూరు రాజబాబు, మలిశెట్టి జగదీష్ లు మృతదేహాన్ని పరిశీలించి రాజకీయ హత్యగా ఆరోపించారు.
హత్య చేసిన వారిని, హత్యకు ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడు సింహాద్రి రవికుమార్ కుమారుడు మాట్లాడుతూ రాజకీయంగా, కుటుంబ పరంగా వైసిపి నాయకులు, తమ కుటుంబ సభ్యులు సాధింపు చర్యలకు పాల్పడుతూ తమ కుటుంబాన్ని హత మార్చేందుకు కుట్రపన్ని తన తండ్రిని హత్య చేయించినట్లు తెలిపారు. తక్షణమే తన తండ్రిని హత్య చేసిన వారిని, చేయించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భర్త రాజకీయ కక్ష నేపథ్యంలోనే హత్య గావించ పడ్డాడని, తన భర్త లేకపోతే తమకు కూడా మరణమే శరణ్యమని మృతుడి భార్య ఆసుపత్రిలో బోరున విలపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు, కుటుంబానికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నూజివీడు డి.ఎస్.పి బి శ్రీనివాసులు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article