టిటిడిపై జగన్ ను వివరణ అడిగిన మంచు హీరో

Manchu Manoj letter to Jagan

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయానికి అర్హం కాని అంశమంటూ ఏదీ లేదు. శాసన సభల్లో బలం లేకపోయినా మీడియా అండతో ప్రతిపక్షం ఇప్పుడు చాలా బలమైనదిగా కనిపిస్తోంది. దీనికి తోడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ.. సరైన న్యాయ సలహాదారులు, తగు సూచనలు చేసేవారు లేకపోవడమో లేక చెప్పినా వినకపోవడం వల్లనో మొత్తంగా రకరకాలుగా ఇబ్బందులూ పడుతున్నాడు. ఓ వైపు మంచి చేస్తున్నాడు అనే భావన ఉన్నా..  అది అస్సలు మంచే కాదు, ఇతనోన పచ్చి మోసగాడు, నేరస్తుడు అన్న ప్రతిపక్షాల బాకాల ముందు అవి తేలిపోతున్నాయి. ఈ టైమ్ లో జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. సాధారణంగా చాలా ప్రభుత్వాలు దేవాదాయ భూముల విషయంలో పూర్తి ఆధిపత్యాన్ని చూపుతాయి. గతంలో కూడా తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో టిటిడితో పాటు మరికొన్ని ఇతర హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు మల్లించిన అంశాలు చాలా ఉన్నాయి.

కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే విషయం చేస్తోంటే రాజకీయంగా ప్రతిపక్షాలకు మంచి లబ్ధి చేకూరేలా కనిపిస్తోంది. ఏపి ప్రభుత్వం తాజాగా టిటిడి హయాంలో ఉన్న కొన్ని భూములను వేలం వేసి అమ్మాలనుకుంటోంది. ఈ క్రమంలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా వైసీపీతో దోస్తీ చేస్తోన్న మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్ కుమార్ ఈ విషయంలో క్లారిటీ కావాలంటూ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగని మనోజ్ ఏమీ రాజకీయ పరమైన కమెంట్స్ చేయలేదు. కానీ ఆ వేలంతో పాటు భూముల అమ్మకం విషయంలో క్లారిటీ కావాలనే వివరణ డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు అతను రాసిన ఓ లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మనోజ్ రాసిన లెటర్ యధాతథంగా చూస్తే..

‘ఓం నమో వేంకటేశాయ

టిటిడీ ఆస్తులు అమ్మమమని దేవుడేమన్నా చెప్పాడా.. ?
కరోనా సంక్షోభంలో రోజుకు లక్షమందికి ఆకలి తీర్చమని కూడా చెప్పాడా.. ? చేసేది, చెప్పేదీ అంతా టీటీడీ పాలక మండలి. సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి. కొండపైన ఉన్న వడ్డీకాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయి అంటే ‘‘గోవిందా గోవిందా’’ అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది.
మోసం జరగట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్ సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తూండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు..? అని పాలకమండలి కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే.
ఏమీ లేదు సార్
ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే. జై హింద్..

ap politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *