పెళ్లి తర్వాత ఆటుపోట్లకి గురైన తన జీవితాన్ని మళ్లీ చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు మంచు మనోజ్. రెండో పెళ్లితో
కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తన మనసు ఎరిగిన భూమా మౌనిక రెడ్డిని ఆయన వివాహం చేసుకొంటున్నారు. ఈ రాత్రే మనోజ్, మౌనికల పెళ్లి ముహూర్తం. ఎమ్ అండ్ ఎమ్ పేరుతో జరుగుతున్న ఈ పెళ్లిని అన్నీ తానై జరిపిస్తున్నది ఎవరో తెలుసా? మంచు మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న.
హైదరాబాద్ ఫిలిం నగర్‌లోని తన ఇంట్లోనే ఈ పెళ్లి వేడుకని నిర్వహిస్తోంది లక్ష్మి. మనోజ్… లక్ష్మి ఒకరంటే ఒకరికి ప్రాణం. అందుకే ఈ పెళ్లి బాధ్యతని తనే భుజాలపై వేసుకున్నారు లక్ష్మి. ఇదివరకు మనోజ్… ప్రణతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు, దివంగతులైన భూమా నాగిరెడ్డి, భూమా శోభల చిన్న కూతురైన భూమా మౌనికకి కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరి జీవితాల్లో ఇకపై అంతా శుభమే జరగాలని కోరుకుందాం…