చిన్నారి ప్రాణం తీసిన గాలిపటం మాంజా

156
Manja thread kills 3-year-old boy
Manja thread kills 3-year-old boy

Manja thread kills 3-year-old boy

మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంతోషంగా గడుపుతారు. అలాంటి గాలిపటం గుంటూరులో  ఒక కుటుంబంలో విషాదం నింపింది. గాలిపటానికి కట్టే మాంజా మూడేళ్ల బాలుడి ప్రాణం తీసింది. నేడు బాబాయ్‌‌తో కలిసి గాలిపటం కొనుక్కున్న బాలుడు బైక్‌పై వెళుతున్నాడు. బాలుడి చేతిలో మాంజా ఉంది. అకస్మాత్తుగా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో బాలుడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అంతేగాక.. మెడభాగం పూర్తిగా తెగిపోయింది. గమనించిన బాబాయ్..జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. సంక్రాంతి పండుగ మరికొద్ది రోజులు ఉందనగా..బాలుడు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండుగ పూట గాలిపటం ఆ కుటుంబంలో నింపిన విషాదం అంతా ఇంతా కాదు . అందుకే పిల్లలు గాలిపటాలను ఎగరేస్తున్న సమయంలో పెద్దలు జాగ్రత్తగా గమనించాలి . లేకుంటే ఇలాంటి ఘటనలు తీవ్ర వేదనను మిగులుస్తాయి.

Manja thread kills 3-year-old boy,guntur, kite, manja , neck cut, boy died , three years old , sankranthi festival ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here