భారత షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో దేశ కార్తిని పతాకస్థాయికి తీసుకెళ్లింది.పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశానికి తొలి పతకంతో పాటు మొత్తంగా రెండు పతకాలు అందించింది మను భాకర్. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ పతకానికి గురిపెట్టింది.తనకు ఇష్టమైన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్ కు చేరింది మను భాకర్. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్‌లో 590 పాయింట్ల స్కోరుతో రెండవ స్థానంలో నిలిచిందీ షూటర్. ప్రిసిషన్ రౌండ్‌లో 97, 98, 99తో మొత్తం 294 పాయింట్లు సాధించిన మను భాకర్ మూడో స్థానంలో నిలిచింది.
ఆ తరువాత జరిగిన ర్యాపిడ్ రౌండ్‌లో మొదటి స్కోరునే 100గా నమోదు చేసిన మను భాకర్.. క్రమంగా 98, 98 స్కోరు చేసి మొత్తం 296 పాయింట్లు సాధించింది. దీంతో మను భాకర్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే ఫఐనల్ ఈవెంట్ లోను పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఐతే పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ ప్రదర్శన తమకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని, ఒలింపిక్ ఛాంపియన్స్ అంటున్నారు. గత కొన్నేళ్లుగా మను భాకర్ ప్రదర్శన చాలా పుంజుకుందని 2016 ఒలింపిక్స్‌లో 25 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ విన్నర్ గ్రీస్‌కు చెందిన అన్నా కొరకాకి ప్రశంసించింది.