maram rphomes @ hayath nagar
ఈస్ట్ హైదరాబాద్‌లో మోస్ట్ ప్రామిసింగ్ డెవలపర్ ఎవరంటే.. టక్కున గుర్తుకొచ్చేది మారమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మాత్రమే. ఎందుకంటే, గత కొంతకాలం నుంచి కోర్ ఎల్బీనగర్ ఏరియాలో సక్సెస్‌ఫుల్‌గా.. సకాలంలో ఇళ్లను అందజేసిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. మారమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రత్యేకత ఏమిటంటే.. ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా డెలివరీ డేట్‌ను ముందే అనౌన్స్ చేస్తుంది. దానికి అనుగుణంగా ఆయా ప్రాజెక్టును తప్పనిసరిగా డెలివరి చేస్తుంది. ఇలా, టైమ్లీ డెలివరీ ఇచ్చే నిర్మాణ సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తుంది మారమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఈ సంస్థ తాజాగా జీహెచ్ ఎంసీ లిమిట్స్ లోని హయత్‌నగర్‌లో మారమ్ ఆర్పీ హోమ్స్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలోని హయత్ నగర్ లో గల జీ హై స్కూల్ కి చేరువలో ఆర్పీ హోమ్స్ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ఫ్లాట్ కొన్నవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీములో భాగంగా.. ఎంతలేదన్నా 2.30 లక్షల దాకా వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇలా వడ్డీ రాయితీని అందించే ప్రాజెక్టుల్ని హైదరాబాద్‌లో వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
సాధారణంగా అఫర్డబుల్ హోమ్స్ అంటే చాలు.. పెద్దగా సౌకర్యాల్లేని చిన్నచిన్న ఫ్లాట్లు ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ, ఆర్పీ హోమ్స్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. నివాసితుల మధ్య బంధాలను దృఢపరిచే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. పైగా, నగరానికి ఎక్కడో దూరంగా విసిరేసినట్టుగా కాకుండా.. జీహెచ్ఎంసీ లిమిట్స్‌లోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుండటం విశేషం. దాదాపు ఎకరా స్థలంలో స్టార్ట్ చేసిన ఆర్పీ హోమ్స్‌లో మొత్తం 110 ఫ్లాట్లు వస్తాయి. ఇందులో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అత్యంత సులువుగా సొంతిల్లు కొనుక్కోవాలన్న ఓ బృహత్ లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. అందుకే, బడా ఫ్లాట్ల జోలికి వెళ్లకుండా.. ప్రాజెక్టు మొత్తాన్ని తొమ్మిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే డిజైన్ చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా.. ప్రైవేటు కంపెనీల్లో పని చేసే సిబ్బంది అయినా.. ఇందులో కొనుక్కోవడానికి వీలుండేలా ఫ్లాట్ల సైజును నిర్ణయించింది.
మారమ్ ఆర్పీ హోమ్స్‌లో గ్రౌండ్ వాటర్‌కి కొదవే లేదు. స్కూళ్లు, బ్యాంకులు, కాలేజీలు, ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లకు చేరువగా ఉందీ ప్రాజెక్టు. క్లియర్ టైటిల్ గల స్థలంలో.. వంద శాతం వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఎంట్రన్స్ గేట్ ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. మంచినీటి కోసం బెంగ పడక్కర్లేదు. ఫ్లాట్లలో వెంటిలేషన్ అద్భుతంగా ఉంటుంది. కాలుష్య ఛాయలు కనిపించనే కనిపించవు. సైలెంట్ బ్యాకప్ జనరేటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నది. మొత్తానికి, ఇందులో నివసించేవారు లగ్జరీ సదుపాయాలను ఆస్వాదించవచ్చు. మారమ్స్ ఆర్ పీ హోమ్స్ లో నివసించే 110 పది కుటుంబాలకు సరిపడా సమస్త సదుపాయాల్నిపొందుపరుస్తున్నారు. మల్టీ పర్పస్ హాల్, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, చిన్నారులకు టాట్ లాట్, ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి వాటికి ప్లాన్ చేసింది. ట్వంటీ ఫోర్ హవర్స్ సెక్యూరిటీ పొందుపర్చింది. మొత్తానికి, తక్కువ ధరకే ఫ్లాట్లను అందజేస్తున్న మారమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోన్న మారమ్ ఆర్పీ హోమ్స్ లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడే మీ కలల గృహాన్ని ఎంచుకోండి.