కళ్యాణ వైభోగమో : రేపట్నుంచి పెళ్లి భాజాలు

51
#Marriage dates in telugu states#
#Marriage dates in telugu states#

#Marriage dates in telugu states#

జీవితంలో మరిచిపోలేని వేడుక పెళ్లి. అందుకే తమ జీవితంలో పెళ్లితంతును ఘనంగా జరుపుకోవాలనుకుంటారు జంటలు. వెడ్డింగ్ షూట్లు, ఎంగేజ్ మెంట్ వేడుకలు, కట్నాలు, కానుకలు, బంధువుల ముచ్చట్లు.. ఇలా పెళ్లి చెప్పుకుంటే పోతే హాడావుడి అంతాఇంతా కాదు. మళ్లీ తెలుగు రాష్ర్టాల్లో పెళ్లి సందడి మొదలు కానుంది. చాలా నెలల తర్వాత ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు సుముహూర్తాలు ఉండటంతో పెళ్లి బాజాలు ఈసారి గట్టిగా మోగనున్నాయి. కొవిడ్‌ పరిస్థితులు కొంత కుదుట పడుతుండడంతో దేవాలయాలు, కల్యాణ మండపాల్లో ఆంక్షలతో కూడిన అనుమతులు లభించనున్నాయి. మూతపడిన కల్యాణ మండపాలు ముస్తాబవనున్నాయి.

ఇవే ముహుర్తాలు

2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూ ర్తాలకు బ్రేక్‌ పడనుండడంతో ఈ సీజన్‌లోనే శుభ కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తేదీల్లో పెళ్లిల్లు జరగనున్నాయి. నిజ ఆశ్వయుజ మాసం ఈ నెల 29, 30, 31, నవంబరు 4, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. కార్తీకమాసంలో నవంబరు 17, 19, 20, 21, 22, 25, 26, డిసెంబరు 1, 6, 8, 9 తేదీల్లో, మార్గశిర మాసంలో డిసెంబరు 17, 18, 20, 24, 27 తేదీల్లోనూ, 2021 సంవత్సరంలో జనవరి 2, 7 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here