కొత్త సినిమా ఎప్పుడు మారుతీ..?

221
maruthi new movie
maruthi new movie

maruthi new movie

ఒక సూపర్ హిట్ మూవీ ఇచ్చిన దర్శకుడు నుంచి మరో సినిమా రావడానికి చాలా టైమ్ పట్టడం చాలా తక్కువగా చూస్తుంటాం. హిట్ డైరెక్టర్స్ వెంట నిర్మాతలు పరుగులు పెడతారు కదా. కానీ ఈ దర్శకుడు కమర్షియల్ విజయం సాధించిన తర్వాత కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కామ్ గా ఉన్నాడు. సినిమా అయితే ఉంది. కథలూ సిద్ధం. కానీ ఎవరితో అనేదే సందిగ్ధంగా ఉందట. అయితే ఇవన్నీ వదిలేసి ప్రతిరోజు పండగే దర్శకుడు మారుతి సరికొత్త పనులతో బిజీ అవుతున్నాడు. ఇంతకీ కొత్త సినిమా ఎప్పుడు..? ఎవరితో మారుతీ..? తొలినాళ్లలో విమర్శలకు పెన్ను నిండా పనిచెప్పిన దర్శకుడు మారుతి. కాస్త అడల్ట్ కంటెంట్ తో వచ్చాడు. అయితేనేం కమర్షియల్ గా విజయాలు అందుకుని.. అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత భలేభలే మగాడివోయ్ సినిమాతో మారుతి కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. మీడియం రేంజ్ హీరోలతో మాగ్జిమం హిట్స్ అందుకోవడం మొదలైంది. కొన్ని సినిమాలు కంటెంట్ రిపీటెడ్ గా అనిపించినా.. కమర్షియల్ గా లాస్ లు పెద్దగా లేవనే చెప్పాలి. దీంతో ఇప్పుడు మారుతి మినిమం గ్యారెంటీ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడుగా తన రేంజ్ మారినా.. మారుతికి స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఈ విషయంలో అతనికీ కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా మెగా హీరోలను డైరెక్ట్ చేయాలనేది మారుతి కోరిక. అది ఎప్పుడు తీరుతుందో కానీ.. రీసెంట్ గా ఆ క్యాంప్ నుంచే సాయితేజ్ హీరోగా ప్రతి రోజు పండగేతో మరో కమర్షియల్ హిట్ అందుకున్నాడు.

కానీ ఆ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు మారుతి. తను ఓ పెద్ద హీరో కోసం చూస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. ఇప్పుడే కాదు.. మరోరెండేళ్ల వరకూ అందరి డేట్స్ ఫిల్ అయి ఉన్నాయి. అందువల్ల మరో మీడియం రేంజ్ హీరోతోనే రావాలి. ఈ విషయంలో ఇంతకు ముందు గోపీచంద్ తో చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. తాజాగా నాని అంటున్నారు. మారుతి ఆలోచనలు ఎలా ఉన్నా.. హిట్ ఇచ్చిన దర్శకుడు.. చాలా కాలం మరో సినిమా అనౌన్స్ చేయకపోతే కొందరికి అనుమానాలు వస్తాయి. అదే టైమ్ లో అతన్నుంచి కొత్త స్క్రిప్ట్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అతను రెండు మూడు స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నాడట. మరోవైపు వెబ్ సిరీస్ లు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడంటున్నారు. ఇదే టైమ్ లో ఓ కొత్త యాప్ ను క్రియేట్ చేసే పనిలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో చూసేవారికి ఖాళీగా కనిపించొచ్చు. కానీ అతను మాత్రం కెరీర్ విషయంలో క్లారిటీగానే ఉన్నాడని చెప్పాలి. ఏదేమైనా కొత్త సినిమా విషయంలో మరీ ఆలస్యం కూడా అన్ని సార్లూ అంత మంచిది కాదేమో మారుతీ..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here