ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ ..10మంది మావోల మృతి

MASSIVE ENCOUNTER IN  CHATTISGHAR

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటన స్థలిలో భారీగా ఆయుధాలు, మందుగుండును కూంబింగ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్ ప్రారంభించిన బలగాలకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురు పడ్డారు. లొంగిపోవాలంటూ హెచ్చరించినా లెక్క చేయకుండా ఎదురు కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు అదనపు బలగాలను తరలించారు.ప్రస్తుతం ఇంకా హోరాహోరీగా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇక ఈ ఎన్ కౌంటర్ ను బీజాపూర్ జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article