Friday, January 10, 2025

Tdp Membership 2024 ప‌శ్చిమంలో భారీ స్థాయిలో టిడిపి స‌భ్య‌త్వ న‌మోదు

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ ప‌శ్చిమంలో నియోజ‌క‌వ‌ర్గంలో భారీ స్థాయిలో టిడిపి స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం చాలా చురుగ్గా సాగుతోంది. 53వ, 54వ , 55వ డివిజ‌న్స్ లో సోమ‌వారం టిడిపి స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం జరిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి బుద్ధా వెంక‌న్న‌గారు, హాజ‌రై ఈ మూడు డివిజ‌న్స్ లో టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు, సానుభూతి ప‌రుల‌కు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు పై అవ‌గాహ‌న క‌ల్పించి పార్టీ బ‌లోపేతానికి భారీగా స‌భ్య‌త్వ న‌మోదులు చేయించారు. నూత‌న స‌భ్య‌త్వ విధానంలో రూ.100 చెల్లించి స‌భ్య‌త్వం తీసుకుంటే టిడిపి కార్య‌కర్త‌ల‌కు అందించే స‌దుపాయాల‌ను బుద్దా వెంక‌న్న‌గారు, వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో 53వ డివిజ‌న్ కి చెందిన‌ టిడిపి నాయ‌కులు మ‌ధు, ఇమ్రాన్, 54వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు స‌లీమ్, తాజుద్దీన్, 55వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు జాహీద్,భ‌వానీ ప్ర‌సాద్ ల‌తో పాటు టిడిపి నాయ‌కులు, కార్య‌కర్త‌లు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com