Meaning for Priya waves
`ఒరు ఆడార్ లవ్` చిత్రంతో నేషనల్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మలయాళీ అమ్మడు నటించిన `ఒరు ఆడార్ లవ్` ఫిబ్రవరి 14న నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ మలయాళీ అమ్మడుకి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కాగా ఈ అమ్మడు ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంది. ఇప్పటి హీరోయిన్స్‌లో చాలా మందికి టాటూలంటే ఆసక్తి ఉన్నట్టే ఈమెకు కూడా ఆసక్తి ఉందనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే ఈమె అనుకోకుండా టాటూలు వేయించుకుంది. మణికట్టు క్రింద ఇన్‌ఫినిటి అనే టాటూతో పాటు ఎదపై కార్ప్ డియమ్ అనే టాబూ వేయించుకుందట. దీనికి అర్థం ఈరోజును నువ్వు సొంతం చేసుకో అని.. అలాగైతే భవిష్యత్ నీదే అవుతుందని కదా అర్థం. ఇక ఇన్‌ఫిటినిటీ అనే లాటిన్ పదానికి అర్థం అనంతమైన ..దానికి తోడు గులాబి కాడ ఉండటంతో అనంతమైన ప్రేమ అని అర్థం. ప్రియా టాటూల వెనుకున్న అర్థాలివేనని ఇంటర్వ్యూస్‌లో చెప్పుకొచ్చింది.