Media Owner Jai Ram was Killed
పారిశ్రామిక వేత్త ,
కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్‌గేట్, ఐతవరం సమీపంలో కారులో మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, మీడియా అధినేత చిగురుపాటి జయరాంగా గుర్తించారు. కార్లో వెనక సీట్లో కూర్చున్న ఆయన తలపై బలమైన గాయాలున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కూడా అక్కడ కనిపించడం లేదు. అయితే కారులో మద్యం సీసాలు ఉన్నట్లు తెలుస్తోంది. జయరాం అనుమానాస్పద మృతి వెనక హత్యా కోణం ఏమైనా ఉందా..? అని ఆరా తీసిన పోలీసులు చివరకు హత్యగానే నిర్ధారించారు . విష ప్రయోగం చేసి హత్య గావించారా అన్న కోణం లో కూడా దర్యాప్తు చేస్తున్న్నారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని వెల్లడించారు. జయరాం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కుటుంబ, వ్యాపార సంబంధమైన కారణాలే ఆయన హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.సూర్యాపేట, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్న పోలీసులు కారును ఓ తెలుపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నడిపినట్లు గుర్తించారు. జయరామ్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి.. ప్రస్తుతం ఆయన అమెరికా పౌరసత్వాన్ని కలిగి వున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం ను హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణాలేంటి? వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేకా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా ? అన్న కోణం లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.