జోగులాంబ గద్వాలకు మెడికల్ కాలేజీ

తెలంగాణలో వెనుకబడిన జోగులాంబ-గద్వాల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా జోగులాంబ గద్వాల్ అని, ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం తెలంగాణలో 7 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సైతం మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం 150 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ జిల్లాకు మినహా ఇతర జిల్లాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జోగులాంబ గద్వాల్ జిల్లాలో 300 పడకలతో కూడిన మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని ఆ లేఖలో కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article