కాళ్ళు,చేతులు కట్టేసి…దారుణహత్య

144
Medical student's body found
Medical student's body found

Medical student’s body found in Telangana

ఖమ్మంలో ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న తుమ్మలపల్లి వంశీ అనే మెడికో దారుణ హత్యకు గురయ్యారు.  కాళ్ళు చేతులు కట్టేసిన స్థితిలో ఉన్న అతను బావిలో శవమై తేలాడు. అతడి చేతులు, కాళ్లు కట్టేసి ఉండడంతో హత్య అని భావిస్తున్నారు పోలీసులు . వంశీ స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనపర్తి. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న వంశీ సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం తిరిగి ఖమ్మం వెళ్లాడు. ఆ సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కాలేజీకి చేరినట్టు సమాచారం అందించాడు. కానీ, ఆ మరుసటి రోజు తండ్రి పొలానికి వెళ్లగా అక్కడి వ్యవసాయబావి వద్ద వంశీ బ్యాగు, చెప్పుల జత కనిపించాయి. బావిలో చూడగా వంశీ శవం కనిపించింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలంలో బావి వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. అసలు వంశీని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? అతను కాలేజ్ కు వెళ్లినట్టు ఎందుకు ఫోన్ చేసి అబద్దం చెప్పాడు? వంశీకి శత్రువులు ఎవరైనా ఉన్నారా ? లేదా వారి కుటుంబానికి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Medical student’s body found in Telangana,khammam, medico, vamshi, bhupalpalli, murder, agriculture well, mbbs student , police case

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here