తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు అగ్ర హీరో చిరంజీవి. ఒక దశలో తనకంటే పెద్ద ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ అంటూ ఆకాశానికెత్తారు. ఇటీవల ఓ
ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడంతోపాటు, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి కూడా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.సినిమా హీరోలన్నాక ఫ్యాన్స్ ఉండటం సహజం.. కానీ మా తమ్ముడు పవన్ కల్యాణ్‌కి భక్తులు ఉన్నారన్నారు చిరంజీవి. ఇండియాలో కల్ట్ ఫాలోయింగ్ ఉండే తారలు కొద్దిమంది మాత్రమే అని, ఆ కొద్దిమందిలో పవన్ ఉంటారని చెప్పారు. ఈ మాటలు మెగా అభిమానులకి చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నిఖార్సయిన నాయకుడని చిరంజీవి
కొనియాడారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న చిరంజీవి, ఇలాంటి వ్యాఖ్యలతో తనకి చేతనైనంతగా తమ్ముడికి మాట సాయం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని కొనసాగిస్తూనే, తన తమ్ముడి పొలిటికల్ మైలేజీకి సాయపడేలా ఆయన అప్పుడప్పుడూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.