Megha Akaash INSTA Hack
`లై`, `ఛల్ మోహన్ రంగ` సినిమాల గురించి తెలిసిన వారికి మేఘ ఆకాష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ గ మేఘ పాటతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను రష్యన్ హాకర్లు హ్యాక్ చేశారు. అశ్లీల చిత్రాలను అందులో పోస్ట్ చేశారు. ఉన్నపాటుగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో అశ్లీల చిత్రాలు వస్తుండేసరికి అవాక్కయిన మేఘా ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు విషయాన్ని వెల్లడించారు. వారు వెంటనే అప్రమత్తమై రష్యన్ హాకర్లు హ్యాక్ చేసినట్టు నిర్ధారించారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే ఆమె అకౌంట్‌ను మరలా పునరుద్ధరిస్తామని కూడా చెప్పారు. అన్నట్టు మేఘ చేతిలో తెలుగులో ఇప్పటికైతే సినిమాలు లేవు. తమిళంలో పేట్టలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించింది. మరోవైపు అత్తారింటికి దారేది తమిళ రీమేక్ లోనూ ఆమె నటించింది