అన్ని జిల్లాలకు మేఘా గ్యాస్ సరఫరా

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యం తో తీసుకువచ్చిన CGD (City Gas Distribution) ప్రాజెక్ట్ లో భాగంగా పెట్రోలియం నాచురల్ గ్యాస్ నియంత్రణా మండలి నిర్వహించిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 11 వ రౌండ్ బిడ్డింగ్ లో అత్యధిక సి జి డీ ప్రాజెక్ట్ లను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) దక్కించుకోనున్నట్లు సమాచారం.

పీ ఎన్ జి ఆర్ బి 65 జాగ్రఫికల్ ఏరియా లకు బిడ్స్ నిర్వహించింది. 61 ఏరియాలకు బిడ్స్ దాఖలు అయ్యాయి. ఇందులో మేఘా సంస్థ 15, అదానీ 13, ఐఒసిఎల్ 9 దక్కించుకోగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు దక్కించుకున్నాయి. మొత్తం జాగ్రఫికల్ ఏరియాల్లో 24 . 6 శాతం ఏరియాను చేజిక్కించుకుని మెగా సంస్థ అగ్రభాగాన నిలిచింది.

మేఘా సంస్థ దక్కించుకున్న జాగ్రఫికల్ ఏరియాలు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ , తెలంగాణాలో ఉన్నాయ్.

కర్ణాటకలో చిక్బల్లాపూర్, యాద్గిర్, తమిళనాడులో తిరువాన్మలై, విల్లుపురం, కళ్లకుర్చీ , అరియాలూర్, పెరంబలూర్, పుదుకోట్టై, శివగంగ, తంజావూరు, దుండిగల్, కరూర్ జిల్లాలో సి జి డీ ప్రాజెక్టును మేఘా దక్కించుకుంది.

మధ్యప్రదేశ్ లో అగరమాళ్వా , నీముచ్, మండసూర్ , బేతుల్, ఛింద్వారా, సెయోనీ , బాలాఘాట్, దామోహ్, జబల్పూర్, కట్ని , మాండలా , ఉమారియా, దిండోరి, హోషంగాబాద్, నర్సింగపూర్, సాగర్, విదిష.

రాజస్థాన్ లో జాల్వార్, మహారాష్ట్ర లో చంద్రాపూర్, వార్ధా, ఒడిశాలో రాయగడ, కలహంది, బోలంగిర్, నౌపాడ, పంజాబ్ లో తరాంతరాన్.

తెలంగాణాలో జోగులాంబ గద్వాల్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి .

ఉత్తరప్రదేశ్ అంరోహ, సాంభాల్, కసగంజ్

ఈ జాగ్రఫికల్ ఏరియాలో సి జి డి ప్రాజెక్ట్ లో భాగంగా సిటీ గేట్ స్టేషన్ (మదర్ స్టేషన్), గ్యాస్ సప్లై పైప్ లైన్ ల నిర్మాణం (మెయిన్, డిస్ట్రిబ్యూటరీ), సి ఎన్ జి స్టేషన్ లను నిర్మించి ప్రజల సౌకర్యార్ధం ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయనుంది.

సిజిడి ప్రాజెక్ట్లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే పైప్ లైన్ నిర్మాణంతో పాటు 32 సిఎన్జి స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి)ని మేఘా సంస్థ మేఘ గ్యాస్ పేరుతో పాటు అందిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article