తమిళనాడులో ‘మెఘా’ 3000 పడకలు

మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా ఉచితంగా 3000 పైగా కోవిడ్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఇందులో 660 బెడ్లు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా చెన్నై, మధురై నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్న ఈ కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సదుపాయం కూడా ఉంది. ప్రత్యేకంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 స్కెలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్లను సిద్ధం చేసింది. తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాలలో చికిత్సను ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. రాజధాని గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ శరవేగంగా ఏర్పాటు చేస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article