అజారుద్డీన్ పై తిరగబడ్డ హెచ్సీఏ సభ్యులు

117

Members in Hca are against to Hca Presdient Azharuddin

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సమావేశం రచ్చరచ్చ అయ్యింది. హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్డీన్ పై సభ్యులు తిరుగుబాటు చేశారు. ఆయన ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు.

ఇవాళ వార్షిక సర్వసభ్య సమావేశం జరగ్గా, 186 మంది క్లబ్ కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. అవినీతి పెరిగిందని, డబ్బులిచ్చినవారినే సెలెక్ట్ చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సమావేశం రసాభాసగా మారడంతో కాంగ్రెస్ నాయకుడు వి హన్మంతరావు మధ్యలోనే వెళ్లిపోయారు. దీపక్ వర్మను అంబుడ్స్ మెన్ గా నియమించాలని అజారుద్డీన్ వర్గం పట్టుబట్టగా, ఆయన నియామకాన్ని వ్యతిరేక వర్గం తిరస్కరించింది. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఏప్రిల్ 11 వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here